పండుగ వేళ.. విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

పండుగ వేళ.. విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్

October 12, 2020

Flipkart seeks students for 45-day paid internship.

విద్యార్థులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ దేశంలోని టైర్ 2 సిటీల్లోని విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్‌‌‌‌షిప్ ప్రొగ్రామ్‌ను‌‌ తీసుకొచ్చింది. ఈ నెల 16న ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేలో భాగంగా విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. ఈ ఇంటర్న్‌‌‌‌షిప్ ప్రొగ్రామ్ 45 రోజులు ఉంటుంది. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు సప్లయి చెయిన్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో నైపుణ్యాన్ని పొందవచ్చు. 

ఈ–కామర్స్ ఇండస్ట్రీలో కస్టమర్లకు సరుకులు డెలివరీ చేసేందుకు వెనుకాల జరిగే ప్రాసెస్‌‌‌‌ను అంతా విద్యార్థులు ఈ ఇంటర్న్‌‌‌‌షిప్ ద్వారా తెలుసుకోనున్నారు. ఫ్లిప్‌‌‌‌కార్ట్ దీని కోసం 21 ప్రాంతాల్లోని పలు విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తోంది. వాటిలో తెలంగాణలోని మేడ్చల్‌‌‌‌, మహారాష్ట్రలోని భివాండి, హర్యానాలోని బినోలా, కర్నాటకలోని మలూర్ వంటి ప్రాంతాలున్నాయి. సప్లయి చెయిన్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ గురించి ఫ్లిప్‌‌‌‌కార్ట్ స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని ఫ్లిప్‌‌‌‌కార్ట్ తెలిపింది.