కరోనా ఎఫెక్ట్..ఫ్లిప్ కార్ట్‌ కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఎఫెక్ట్..ఫ్లిప్ కార్ట్‌ కీలక నిర్ణయం

March 25, 2020

Flipkart

ప్రపంచాన్ని కరోనా కలవరపెడుతోంది. చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. మన దేశంలోనూ ఏప్రిల్ 14వ తేదీ వరకు కర్ఫ్యూ విధించారు. దీంతో కొనుగోళ్లు కూడా పూర్తిగా పడిపోయాయి. ఇప్పటికే ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నందున ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సేవలను కొన్నిరోజుల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. 

కరోనా కారణంగా ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడింది. ఇలాంటి సమయంలో తాము అమ్మకాలు జరపలేమని అందుకే ప్రజలు సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరం ఇంట్లోనే ఉంటూ జాతికి సాయపడాలని సూచించింది. వినియోగదారుల అవసరాలు తీర్చడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పుకొచ్చింది. సాధ్యమైనంత త్వరలో మళ్లీ వినియోగదారుల ముందుకు వస్తామని హామీ ఇచ్చింది. కాగా ఇప్పటికే అమెజాన్ కూడా తన సర్వీసులను నిలిపివేసింది. అత్యవసర సరుకులు మినహా అన్ని సేవలను ఆపివేసింది.