జలదిగ్భంధంలో భక్తులు..! - MicTv.in - Telugu News
mictv telugu

జలదిగ్భంధంలో భక్తులు..!

September 14, 2017

యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగం వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. మూసీ నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సంగం వద్ద భీమ లింగేశ్వర ఆలయాన్ని వరదనీరు చుట్టిముట్టింది. దీంతో కొద్దిసేపటి క్రితమే భీమలింగేశ్వర ఆలయానికి వెళ్లిన ఐదుగురు భక్తులు వరద నీటి మధ్యలో చిక్కుకుపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది వరద ఉధృతి తీవ్రమవుతుండటంతో అప్రమత్తమైన భక్తులు, పూజారి గుడిపైకి చేరుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సమాచారమందుకున్న చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్, స్థానిక ఎస్‌ఐ ఘటనాస్థలానికి చేరుకుని ఆలయంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.