Flood subsided for Kadem project in telangana
mictv telugu

కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. ఊపిరి పీల్చుకున్న ముంపు ప్రజలు

July 14, 2022

భారీ వరదలతో గత కొన్ని రోజులుగా భయపెట్టిన కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. ఏపీలోని అన్నమయ్య ప్రాజెక్టు తరహా కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అంచానకు వచ్చిన అధికారులు.. అందుకు సిద్ధంగా ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పుడు పై నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టుకు ప్రమాదమేమీ లేదని తెలిసి ప్రజలతో సహా అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్ ఫ్లో రెండున్నర లక్షల క్యూసెక్కులు అయితే అవుట్ ఫ్లో కూడా అంతే ఉంది. మొత్తం 18 గేట్లలో ఒక గేటు తెరచుకోవడానికి మొరాయించగా, మిగతా 17 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. కాగా, మహారాష్ట్ర వాగుల ద్వారా వచ్చే వరద సమాచారం తెలియకపోవడం, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే వరద గురించి సరైన అంచనా వేయలేని పరిస్థితి ఉండడంతో సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో అవాక్కయిన అధికారులు అప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్నారు.