చైనాలోని టిబెట్ ప్రాంతాన్ని తుపాను కుదిపేసింది. భారీ వర్షాలు, వరదలతో అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. వరదలతో ఐదు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వరదల ధాటికి నానిపోయిన భవనం ఏ క్షణానైనా కూలిపోయే ప్రమాదం ఉందని ముందే భావించిన అధికారులు వెంటనే అందులో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి.