ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు.. వారిపై అఘాయిత్యానికి ఒడిగడుతుంటారు కామాంధులు. కోరిక తీర్చుకునేందుకు మృగాల్లా పవ్రర్తించి, వారిలో హత్య చేయబడ్డ అబలల గురించి చాలా సార్లు వార్తల్లో విన్నాం. కానీ జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. ఈ సారి ఆ మృగాడిని శివంగిలా ఎదుర్కొంది ఓ మహిళ. తనపై చేయ్యేసిన వాడి తుక్కు రేగ్గొట్టింది. మిగతా అమ్మాయిల్లా భయపడి, బెదిరిపోకుండా.. తెగువని ప్రదర్శించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా… దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన 24ఏళ్ల నషాలి అల్మా ఓ ఫిట్నెస్ మోడల్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కూడా. ఆమె రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఉంటారు. ఎప్పటిలాగే గత నెల జనవరి 22వ తేదీన ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా.. ఓ వ్యక్తి జిమ్ డోర్ దగ్గర ఉన్నట్లు గమనించింది. తనలాగే వర్కౌట్ చేయడానికి వచ్చాడేమో అనుకుని డోర్ ఓపెన్ చేసి.. తాను వర్కౌట్ చేయడానికి వెళ్లింది. అంతలో అతడు ఆమె పై దాడి చేయబోయాడు. తాను ఏమాత్రం భయపడకుండా అతడితో పోరాడింది. దాడి చేసిన వ్యక్తి నుండి ధైర్యంగా తనను తాను రక్షించుకుంది.
View this post on Instagram
ఎదుటి వ్యక్తికి తనకన్నా ఎక్కువ శక్తి ఉందని తెలిసినా… అతనిని ఎదురించింది. అతను ఆమెను బంధించడానికి ప్రయత్నించినా…. ఆమెపై అత్యాచారం చేయాలని గట్టిగా ప్రయత్నించినా… ఆమె ఏ మాత్రం తలొగ్గకుండా ధైర్యంగా పోరాడింది. అతడిని చావగొట్టింది. ఆ దెబ్బలు తట్టుకోలేక అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని జేవియర్ థామస్-జోన్స్‌గా గుర్తించి అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ ధైర్యానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.