Florida woman dragged by 10 feet crocodile alligator
mictv telugu

కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన బామ్మను ఎత్తుకెళ్లిన మొసలి..

February 24, 2023

పెంపుడు కుక్కకు ఇంట్లో బోర్ కొడుతోందని, కాస్త చెరువు గట్టున షికారుకు తీసుకెళ్లి ఓ బామ్మ అనూహ్యంగా బలైపోయింది. చెరువులో వందమీటర్ల దూరంలో ఉన్న ఓ మొసలి ఆమెను గమనించి రయ్యిన దూసుకొచ్చి మెరుపు వేగంతో నీళ్లలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సోమవారం ఈ ఘోరం జరిగింది. సెయింట్ లూసీ ప్రాంతానికి చెందిన గ్లోరియా సెర్గీ(85) తన పెంపుడు కుక్కతో కలిసి స్పానిష్ లేక్స్ ఫెయిర్వేస్ చెరువుగట్టున వ్యాహ్యాళికి వెళ్లింది.

షికారు పూర్తయి ఇంటికి వెళ్తుండగా చెరువులోని 11 అడుగుల పొడవైన భారీ మొసలి వాయివేగంతో దూసుకొచ్చి మొదట కుక్కను కరిచింది. బామ్మ దాన్ని కాపాడబోగా మొసలి ఆమెను నోట కర్చుకుని నీటిలోకి లాక్కెళ్లి చంపేసింది. దగ్గర్నుంచి ఇదంతా చూసిన ఓ మహిళ.. బామ్మను కాపాడేందుకు ప్రయత్నించింది. అయితే ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫోన్ చేసింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే మకరం ఆమెను చెరువులోపలికి లాక్కెళ్లింది. పోలీసులు దానికి మత్తు ఇంజెక్షన్ ఇంచి జూకు తరలించారు. ఈ సంఘటనలో కుక్కమాత్రం ప్రాణాలతో బతికి బయటపడింది. 11 అడుగుల పొడవు ఉంటుందని అంచనా వేశారు. బామ్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.