పూలమ్మే మహిళ ఖాతాలోకి రూ. 30 కోట్లు.. ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు - MicTv.in - Telugu News
mictv telugu

పూలమ్మే మహిళ ఖాతాలోకి రూ. 30 కోట్లు.. ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు

February 5, 2020

Flower vendor 30 crore

నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలందరికీ రూ. 15 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖతాల్లో వేస్తుందన్న ప్రచారాన్ని ఇంకా నమ్ముతున్న వాళ్లు చాలామందే ఉన్నారు. తాము అసలు అలాంటి హామీ ఇవ్వలేదని బీజేపీ నేతలు చెబుతుంటారు. అయితే అప్పుడప్పుడూ అనుకోకుండా కొందరి ఖాతాల్లో లక్షలు, కోట్లు జమ అవుతుండడం చూస్తుంటే కొందరికి చప్పున ఆ హామీ గుర్తొంటుంది. ఇక విషయంలోకి వెళ్తే.. పూలు అమ్ముకుని పొట్టపోసుకునే ఓ మహిళ ఖాతాలోకి ఏకంగా రూ. 30 కోట్లు వచ్చి పడ్డాయి. 

కర్ణాటకలోని చెన్నపట్నానికి చెందిన రీహానా అనే మహిళ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తోంది. భర్తతో కలసి పూల వ్యాపారం చేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆమెకు జన్‌ధన్ ఖాతా ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో ఆ ఖాతాలోకి రూ. 30 కోట్లు వచ్చాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఆమె ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. తాము ఇటీవల ఓ చీర కొన్నామని, బంపర్ డ్రాలో కారు తగిలినట్లు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడని రిహానా దంపతులు తెలిపారు. కారు కావాలంటే 7 వేలు చెల్లించారని చెప్పారని, తాము కట్టలేకపోయామని వివరించారు. ఈలోపు ఖాతాలో 3 కోట్లు వచ్చాయని, ఆ డబ్బు తమకు వచ్చిందే కావొచ్చన్నారు. పోలీసులు అనుమానంతో ఆమె ఖాతాను సీజ్ చేశారు. దీనిపై రిహానా దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పేదవాళ్లమని, అనారోగ్యంతో బాధపడతున్నామని రూ. 30 కోట్లలో రూ. 15 కోట్లు ఇచ్చి మిగతా మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నారు. అయితే అసలు ఆ డబ్బు ఎలా వచ్చిందో తేల్చడానికి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.