పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తా.. మొగులయ్య - MicTv.in - Telugu News
mictv telugu

పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తా.. మొగులయ్య

May 18, 2022

కేసీఆర్ తన కళా ప్రతిభను గుర్తించి ఆదుకున్నారని పద్మశ్రీ అవార్డు గ్రహీత, జానపద గాయకుడు మొగులయ్య అన్నారు. అచ్చంపేట బీజేపీ నేతలు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, తన నోట్లో మన్ను పోస్తున్నారని మండిపడ్డారు. తనను ఇబ్బంది పెడితే పాపం తలుగుతుందని హెచ్చరించారు. కేసీఆర్ తనకు కోటి రూపాయలు, హైదరాబాద్ లో 300 గజాల స్థలం ఇచ్చారంటూ మొగులయ్య తాజాగా వీడియోలో తెలిపారు.

పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లు ఇచ్చారని చెబుతున్నారని, తనను ఇబ్బంది పుడితే ఆ అవార్డు కూడా వెనక్కి ఇచ్చేస్తానని అన్నారు.
తనకింకా ప్రభుత్వం నుంచి బహుమతి డబ్బు రాలేదంటూ మొగులయ్య ఓ బీజేపీ నేతతో అంటున్న వీడియో వైరల్ కావడం, తనను ఇబ్బంది పెట్టేందుకే ఆ వీడియోను మీడియాలో ఉంచారని ఆయన మండిపడ్డం తెలిసిందే.