మైక్ టీవీలో పాటలపోటీ.. రావాలె రావాలె.. - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీలో పాటలపోటీ.. రావాలె రావాలె..

October 16, 2019

కష్టం, సుఖం, దుఖ్ఖం, ధూంధాం ఏదైనా పాటలోనే కనిపిస్తుంది. శ్రమజీవనం నుంచి పుట్టినటువంటి పల్లె పాటలకు 10టీవీ పట్టం కట్టబోతోంది. మైక్ టీవీ పర్యవేక్షణలో పాటలపోటీతో జానపద గాయనీ గాయకులకు పబ్బతి పట్టబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని జానపద కళాకారులను ప్రోత్సహించే దిశలో ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ కార్యక్రమాన్ని తీసుకువస్తోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో విడుదల అయింది. ప్రముఖ గాయని మంగ్లీ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. మీరు జానపద పాటలను అలవోకగా పాడగలరు, పోటీలో పాల్గొని విజేతగా నిలువగలరు అనే విశ్వాసం వుంటే చాలు. మీరే విజేత అవ్వొచ్చు. 

ఊరూరా ఎంతో మంది జానపద కళాకారులు వున్నారు. ఇది మీకొక సువర్ణావకాశంగా భావించగలరు. ఒక్కసారి మీ టాలెంట్‌కు పదునుపెట్టండి. మీ దగ్గర పుట్టలకొద్దీ పాటలు వుంటాయి. వాటిలోంచి ఏవైనా రెండు పాటలను తీసుకుని ఒక్కక్క పాటను రెండు నిమిషాలు పాడి ఫోన్‌లో రికార్డు చేసి, మా వాట్సాప్ నంబర్ 8498084053కి పంపించండి. వాటిలోంచి చక్కగా పాడేవారిని ఎంపికచేసి మా ఫోక్ స్టూడియోలో పాడటానికి ఆహ్వానిస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఫోన్ అందుకోండి పాట పాడండి.. వాట్సప్ చేయండి. మీ పాటలు మాకు చేరాల్సిన ఆఖరుతేదీ 25-10-019.