ఫోక్‌ స్టూడియో ఎపిసోడ్ 2 వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

ఫోక్‌ స్టూడియో ఎపిసోడ్ 2 వచ్చేసింది

December 3, 2019

జానపదాలకు పట్టం కడుతూ మైక్ టీవీ, 10 టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటల పోటీకి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే మైక్ టీవీ యూట్యూబ్‌లో విడుదలైన ఎపిసోడ్ 1కి విశేష స్పందన లభిస్తోంది. ఫోక్ స్టూడియో పాటల పోటీ చాలా బాగుందని వీక్షకులు కామెంట్లు చేస్తున్నారు

అంతరించిపోతున్న జానపద కళను భవిష్యత్తు తరాలకు అందించాలని మైక్ టీవీ, 10టీవీ సంకల్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఫోక్ స్టూడియో ‘పాటలు పాడటానికి రండి’ అని పిలుపు ఇవ్వగానే చాలా మంది స్పందించారు. దాదాపు 4000 ఎంట్రీస్ రాగా వారందరిలోంచి వడపోసి 48 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఫైనల్ వరకు వెళ్లేది ఎవరో? ఫోక్ స్టూడియో టైటిల్ విన్నర్ ఎవరో? తెలియాలంటే కార్యక్రమాన్ని చూడాల్సిందే. ఈ కార్యక్రమానికి మంగ్లీ, బల్వీర్ సింగ్ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ జానపద గాయకులు, గేయ రచయితలు మిట్టపల్లి సురేందర్, మురళి మధు, వరంగల్ శ్రీనివాస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.