మిస్ అవ్వకండి.. ఫోక్‌ స్టూడియో షురువైంది.. 10టీవీలో ఈరోజు రాత్రి 8:10 గం,కు - MicTv.in - Telugu News
mictv telugu

మిస్ అవ్వకండి.. ఫోక్‌ స్టూడియో షురువైంది.. 10టీవీలో ఈరోజు రాత్రి 8:10 గం,కు

December 1, 2019

జానపదాలకు పట్టం కడుతూ మీ మైక్ టీవీ, 10 టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ‘ఫోక్ స్టూడియో’. నిన్న శనివారం రాత్రి 8:10 గంటలకు ప్రారంభం అయింది. తొలి ఎపిసోడ్ చాలా బాగుందని చాలా మంది కామెంట్ల రూపంలో చెబుతున్నారు. మంచి కార్యక్రమం అని ప్రశంసిస్తున్నారు. ఏ ఛానల్ చూసినా సినిమా పాటలు తప్పితే ఇలాంటి మనసుకు హాయి గొలిపే పాటలు ప్రసారం కావడంలేదు అంటున్నారు. 

పోష్ కల్చర్‌లో మన పెద్దమనుషులు మనకు నిధిలా ప్రసాదించి వెళ్లిన జానపదాలను మరిచిపోతున్నామేమో అని మాకు రంది షురువైంది. ఈ నేపథ్యంలో జానపదాలను, వాటిని ఆలపించేవాళ్లను వెలుగులోకి తీసుకురావాలని సంకల్పించాం. ‘పాటలు పాడటానికి రండి’ అని పిలుపు ఇవ్వగానే చాలా మంది స్పందించారు. కొండాకోనల్లోంచి కుహూ కుహూ రాగాలు తీస్తూ పోటీలు పడ్డారు. వారందరిలోంచి వడపోసి 48 మందిని సెలెక్ట్ చేశాం. వీరిలో ఫైనల్ వరకు వెళ్లేది ఎవరో? ఫోక్ స్టూడియో టైటిల్ విన్నర్ ఎవరో? తెలియాలంటే కార్యక్రమాన్ని చూడాల్సిందే. 

మంచి మంచి పాటలు.. మీరు కనీ వినీ ఎరుగని కమ్మని పాటలు. గ్రామీణ శ్రమ జీవన సౌందర్యాన్ని, యారాండ్లు, అత్తలు, అల్లుళ్లు, పొలం, ఒడ్డు, ఒరం, గట్టు, పుట్ట, బర్రె, గొర్రె, రాయి, రప్ప.., ఇలా ప్రతీదీ జానపదంలో కలగలిసిన అందమైన పాటలు. ప్రతీ ఎపిసోడ్‌లోని పాటలు మిమ్మల్ని అలరిస్తాయి. ఆనాటి జ్ఞాపకాలను వల్లెవేస్తాయి. ఆ అనుభూతులు కావాలనుకుంటే కార్యక్రమాన్ని అస్సలు మిస్ అవకుండా వారం వారం చూడండి. ఇవాళ కూడా రాత్రి 8:10 గంటలకు తప్పకుండా చూడండి. ఇకపై వారానికి రెండు రోజులు జానపద పాటల్లో విహరించండి. మంచి అనుభూతిని మీ సొంతం చేసుకోండి. కాగా, ఈ కార్యక్రమానికి మంగ్లీ, బల్వీర్ సింగ్ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. మిట్టపల్లి సురేందర్, మురళి మధు, వరంగల్ శ్రీనివాస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. క్రింది లింకులో నిన్నటి ఎపిసోడ్ చూడొచ్చు.