ఫోక్ స్టూడియో క్వార్టర్ ఫైనల్స్ - 4 వచ్చేసింది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఫోక్ స్టూడియో క్వార్టర్ ఫైనల్స్ – 4 వచ్చేసింది (వీడియో)

January 22, 2020

bbhbh

వారం వారం కనీవినీ ఎరుగని అచ్చమైన, స్వచ్ఛమైన పల్లె పాటలతో మిమ్మల్ని ఆకట్టుకుంటున్న కార్యక్రమం ‘ఫోక్ స్టూడియో’. గత మూడు వారాలుగా క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి. మేమంటే మేము అన్న తీరుగా అందరూ చక్కగా పాడుతున్నారు. ఈ క్వార్టర్ ఫైనల్స్‌లో 13 మంది గాయనీగాయకులు పాడుతున్నారు. ఈ పదమూడు మందిలో ఎవరు సెమీ ఫైనల్స్ రౌండుకు వెళ్తారు అన్నది ఈ క్వార్టర్ ఫైనల్సే నిర్ణయిస్తాయి.  ఈసారి సూర్యాపేట నుంచి వచ్చిన భూతం రమేశ్ చాలా గమ్మత్తైన పాటతో వచ్చాడు. ‘ఊరివెనకా ఉల్లితోట మాయాల్ల మల్లూరి బావ..’ అంటూ మల్లూరి బావ గరించి పాడి అలరిస్తాడు. 

అలాగే నిజామాబాద్ నుంచి వచ్చిన సుంకపాక ధరణి ‘ఎండిగజ్జె పైడి మువ్వ తుమ్మెద ఉయ్యాలో.. లేగదూడ పాయె తుమ్మెద ఉయ్యాలో..’ అంటూ స్వచ్ఛమైన జానపదాన్ని పాడి అలరిస్తారు. పాలమాకుల శివకృష్ణ కూడా తానేం తక్కువ కాదని ‘పోదామె కూడవెల్లి జాతర.. అయ్యో కూడిపోదాము రాయె పిల్లో నా రంగమ్మా’ అంటూ తన మరదలిని జాతరకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సర్వేశ్వర రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని గొంతు. ‘అల్లో నేరెడల్లో అదిరిపోయెను నీ సోకు పిల్లో..’ అంటూ పిల్ల సోకుల గురించి పాట పాడుతున్నాడు. క్వార్టర్ ఫైనల్స్ గెస్ట్ మన విమలక్క మిమ్మల్ని తనదైన పాటతో అలరిస్తారు. క్రింది లింకులో పూర్తి ఎపిసోడ్ చూడండి.