సొరకాయ-బీరకాయ.. ధూంధాంగా క్వార్టర్ ఫైనల్స్(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

సొరకాయ-బీరకాయ.. ధూంధాంగా క్వార్టర్ ఫైనల్స్(వీడియో)

January 27, 2020

Quarter Finals - 5

మైక్ టీవీ, 10 టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ క్వార్టర్ ఫైనల్ 5వ ఎపిసోడ్ వచ్చేసింది. మొదటి రౌండ్‌లో పాటగాళ్లందరూ ఆణిముత్యాల్లాంటి పాటలతో అదరగొట్టారు. 13 మంది 13 పాటలతో మెప్పించారు. మొదటి రౌండ్ అయిపోయి రెండో రౌండుకు చేరుకుంది. ప్రజా గాయని విమలక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఒక్కొక్కరు పాడుతుంటే పల్లె సంస్కృతే కాదు, భాషలోని కొత్త కొత్త పదాలు కూడా మనకు పరిచయమవుతాయి. గాయకుల జిల్లా, గ్రామాల ప్రజల బాధలు, కష్టాలు కళ్లకు కడుతున్నారు. 

 కామారెడ్డి జిల్లా అన్నారం తండా నుంచి వచ్చిన నిహారిక తండా సోయగాన్ని, బంజారాల జన జీవన సౌందర్యాన్ని తన పాటతో చెబుతున్నారు. ‘సిలుక పలుకవె రామ రఘురామ..’ అంటూ చిలక పాటతో వచ్చారు. ‘సొరకాయ బీరకాయ ముదిరితే కొరగాదు..’ అనే తమాషా పాటతో ఖమ్మం నుంచి వచ్చిన రామకృష్ణ మనల్ని నవ్విస్తాడు.  ఖమ్మం నుంచి వచ్చిన మరో నికార్సయిన పాటగాడు, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఈ వారం మంచి జోష్ ఫుల్ పాటతో వచ్చారు. ‘తాగన్నా పోదువురార టేషన్ల.. నువ్వు ఊగన్నా పోదువురారో ఇంటిలో..’ పాట పాడారు. 

ఇక విజయనగరం నుంచి వచ్చిన రఘు గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. అతడు పాడుతూ వేసే స్టెప్ ఆకట్టుకుంటోంది. ‘గాపుతీతకు ఎల్లమన్నది మాయత్త.. ఎల్లాక వద్దన్నాది మనసే మాయత్త..’ అని అంటున్నాడు. మహబూబ్ నగర్ నుంచి వచ్చిన నర్సింలు ‘లేకలేకాని నువ్వు చేనంటూ ఏసుకుంటె పిందిపిల్లల గుంపు పనివట్టిపాయె..’ అంటూ రైతు పాట్ల గురించి పాటలో పొందుపరిచి పాడుతున్నాడు. పొలం వేశాక పందులు ఎలా పంటను నాశనం చేస్తాయో పాట రూపకంగా చెప్పాడు. ‘ఆకాశాన నిచ్చెనేసి ఎన్నేలాయిలో.. అర్శికొమ్మలాగావోతె ఎన్నెలాయిలో..’ పాటతో కడప నుంచి వచ్చిన స్వాతి మనలను అలరిస్తారు. వీరిలో ఎవరు సెమీ ఫైనల్స్‌కు వెళ్తారో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్‌లో తేలనుంది. క్రింది లింకులో మొత్తం ఎపిసోడ్‌ను చూడగలరు.