ఫోక్ స్టూడియో.. దుమ్ము రేపుతున్న క్వార్టర్ ఫైనల్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫోక్ స్టూడియో.. దుమ్ము రేపుతున్న క్వార్టర్ ఫైనల్స్

January 16, 2020

Folk Studio0

మైక్ టీవీ, 10 టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌కు ఎంపికైన 13 మందిలో నలుగురు పాడగా, మరో నలుగురు ఈ ఎపిసోడ్‌లో పాడుతున్నారు. వచ్చే ఎపిసోడ్‌లో ఐదుగురు పాడుతారు. అందరూ గొప్పగా పాడుతున్నారు. ఒకరికి ఒకరు సాటి అన్నట్టు గళాలు విప్పుతున్నారు. 

అస్సలు వెనకడుగు వేయమని.. తమ పాటతో న్యాయనిర్ణేతలను మెప్పించి, కచ్చితంగా ఫోక్ స్టూడియో విజేతలుగా నిలుస్తాం అని చాలా ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. చూడాలిమరి ఎవరు బాగా పాడి న్యాయనిర్ణేతలను ఒప్పిస్తారనేది. క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రజాగాయని విమలక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. కామారెడ్డి జిల్లా బంజారా తండా నుంచి వచ్చిన నిహారిక ‘సడకు బాయికాడ సాలు సింతల కాడ సైగ జెయ్యాలె చెల్లో మేనకోడలు వరుస’ అంటూ తన పాటతో క్వార్టర్ ఫైనల్స్‌కు ఊపు తీసుకువచ్చింది. 

ఖమ్మం నుంచి వచ్చిన రామకృష్ణ ఇప్పటికే మైక్ టీవీలో సంక్రాంతి పాట పాడిన విషయం తెలిసిందే. ‘చెరువులోన చేపపిల్ల సాకిరేవుకాడ సక్కనిపిల్ల.. సన్నజాజి మల్లెతీగ ఓ రాజమ్మ.. సన్నాని నడుములాంటిదానివే’ అని పాడి మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తాడు. అలాగే ఖమ్మం నుంచి వచ్చిన మరో గాయకుడు వెంకటేశ్వర్లు ‘నను మందలించబోకురా ముద్దుల మామా.. నను రంది జెయ్యబోకురా..’ అనే పాటతో వచ్చాడు. విజయనగరం నుంచి వచ్చిన రఘు గురించి ప్రత్యేకంగా చెప్పాలేమో. ఆయన పాట, ఆట చాలా ప్రత్యేకమైనవి. ‘సంతానం సామొచ్చాడు ఓలమ్మో.. సామెంత బాగున్నాడె..’ అని ఫోక్ స్టూడియో వేదికను రంజింపజేశాడు. క్రింది లింకులో ఫోక్ స్టూడియో క్వార్టర్ ఫైనల్స్ పూర్తి ఎపిసోడ్ చూసి మీ అభిప్రాయాలు పంచుకోండి.