సన్నారి సన్నారి.. బంజారా పాటతో సెమీ ఫైనల్స్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

సన్నారి సన్నారి.. బంజారా పాటతో సెమీ ఫైనల్స్ (వీడియో)

February 10, 2020

మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న పాటలపోటీ కార్యక్రమం ‘ఫోక్ స్టూడియో’ సెమీ ఫైనల్స్ ఆసక్తిగా సాగుతున్నాయి. సెమీ ఫైనల్స్ కదా.. కంటెస్టెంట్లు మరిన్ని మంచి మంచి పాటలను ఎంచుకుని వచ్చారు. ఈ రౌండ్‌లో తమ సత్తా నిరూపించుకుని ఫైనల్స్‌కు వెళ్లాలని ఒక్కొక్కరు మరింత ఉత్సాహంగా పాటలు పాడుతున్నారు. ఫోక్ స్టూడియో టైటిల్ విజేతలుగా నిలవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘నల్లనల్లని వెన్నెల వెన్నెల’ అనే పాటతో మంగ్లీ మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తారు. ‘ఏలె ఏలె ఏలె ఏలె బాపూయి అన్నా.. పరమావి అన్నా’ అనే బంజారా పాటతో న్యాయ నిర్ణేతల్లో ఒకరైన మురళి మధు మిమ్మల్ని ఉర్రూతలూగిస్తారు.  

అలాగే ‘గూటిలో చిలకేదిరా గూడి విడిచి పోయెరా.. కోటదాటి పేటదాటి బాటలేని అడవిదాటి..’ అని ఒకరు తన చిలుక జాడ చెప్పమని మిమ్మల్నితన పాటతో అడిగేస్తారు. మరొకరు ‘పల్లె మారింది నా పల్లె మారింది..’ అంటూ పల్లెటూళ్లు మారిన తీరును కళ్లకు కడతారు. పల్లె ముఖాలు అభివృద్ధి అనే సాకుతో పౌడర్ అద్దుకుంటున్నాయని చక్కగా చెబుతారు. మరో గాయని నిహారిక ‘సన్నారి సన్నారి’ అంటూ బంజారా పాట పాడి మిమ్మల్ని బంజారా సాంస్కృతిక జీవనంలోకి లాక్కెళ్తారు. ఇలా అందరికందరూ భూమి దద్దరిల్లిపోయేలా ధూంధాం పాటలను ఎంచుకుని వచ్చారు. ఆలస్యం చేయకుండా క్రింది లింకులో పూర్తి ఎపిసోడ్‌ను చూసేయండి.