ఫోక్ స్టూడియో క్వార్టర్ ఫైనల్స్‌.. విమలక్క పాట స్పెషల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫోక్ స్టూడియో క్వార్టర్ ఫైనల్స్‌.. విమలక్క పాట స్పెషల్

January 14, 2020

Folk Studio.

మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జానపద పాటల పండగ ‘ఫోక్ స్టూడియో’ మీ అమూల్యమైన ఆదరణతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పటివరకు జరిగిన ప్రిలిమ్స్ ఎపిసోడ్స్ మిమ్మల్ని బాగా అలరించాయనే అనుకుంటున్నాం. ముందు ముందు కూడా ఇదే ఊపుతో కార్యక్రమం మిమ్మల్ని మరింత అలరిస్తుందని కచ్చితంగా చెప్పగలం.   ఇప్పటివరకు జరిగిన 12 ఎపిసోడ్‌ల నుంచి క్వార్టర్ ఫైనల్‌కు మా న్యాయనిర్ణేతలు 13 మందిని ఎంపిక చేశారు. 12 మందినే ఎంపిక చేయాల్సింది కానీ, ఓ కంటెస్టెంట్ బాగా పాడటంతో న్యాయనిర్ణేతలు అతన్ని ఎంపిక చేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు పాడటం ఒకెత్తు. ఇకముందు పాడటం మరో ఎత్తు. ఇప్పుడు పాటల ఎంపిక, ట్యూను, సాహిత్యం ఇలా ప్రతీ విషయంలో కంటెస్టెంట్లు చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. 

కాస్త అటూ ఇటైనా న్యాయనిర్ణేతలను మెప్పించలేమని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు మరిన్ని మంచి పాటలతో గళం విప్పుతున్నారు. అలా వారు ఈ రౌండ్‌లో తమ పాటలతో న్యాయనిర్ణేతలను మెప్పించగలిగితే సెమీ ఫైనల్స్‌కు వెళ్తారు. అక్కడా మెప్పించారంటే ఇక వారే ఫోక్ స్టూడియో విజేతలుగా నిలుస్తారు. 

క్వార్టర్ ఫైనల్స్ అంటే స్పెషల్‌గా ఉండాలి కదా. అందుకే ఈవారం స్పెషల్ గెస్ట్‌గా విమలక్కను ఆహ్వానించాం. విమలక్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందరికీ విమలక్క పరిచయమే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జెకట్టి ముందుండి నడిచారు. ఆమె పాటలు అనేకం. పోరాట పాటలే కాకుండా సామాజిక సమస్యలు, ప్రజల కష్టాలమీద అనేక పాటలు రాశారు. మరి ఉత్కంఠగా సాగే ఈ క్వార్టర్ ఫైనల్ రౌండ్ ఎంత మజాగా ఉంటుందో క్రింది లింకులో చూడండి.