ఫోక్ స్టూడియో గ్రాండ్ ఫినాలే.. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా - MicTv.in - Telugu News
mictv telugu

ఫోక్ స్టూడియో గ్రాండ్ ఫినాలే.. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా

February 21, 2020

cfbvf

వారం వారం మిమ్మల్ని పల్లె పాటల పూదోటలో విహరింపజేస్తున్న ‘ఫోక్ స్టూడియో’ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. రేపు (శనివారం), ఎల్లుండి(ఆదివారం) రెండు రోజులు గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్‌గా సాగుతుంది. ఆ వైభవానికి తగ్గట్టు అతిథులు కూడా ఈ వారం మిమ్మల్ని అలరించనున్నారు. గ్రాండ్ ఫినాలేకు అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినప్పుడు అత్తమ్మలు, తాతలు, నానమ్మలు పాడిన పాటలు గుర్తుకు వచ్చాయని విజయ్ అన్నాడు. విజయ్ చేతుల మీదుగానే ఫోక్ స్టూడియో విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది. పాటల కనకవ్వ, కడప స్వాతి గ్రాండ్ ఫినాలేకి స్పెషల్ పాటలు పాడుతున్నారు. వారి పాటలతో కార్యక్రమానికి మరింత ఊపు వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

విజయ్‌తో మరికొంతమంది అతిథులు కూడా విచ్చేస్తున్నారు. టీవీ9 అధినేత మైహోమ్ రామేశ్వర రావు, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, జూపల్లి మేఘన, శ్రీసాయి దీక్షిత డెవ్‌లపర్స్ అధినేత మార్ల భీంరాజ్‌, టీసాట్ సీఈఓ శైలేష్ రెడ్డి, మైక్ టీవీ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డిలు విచ్చేశారు. మైక్ టీవీ, ఫోక్ స్టూడియో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఫైనల్స్‌లో ఎనిమిది మంది పాడగా, వారిలోంచి నలుగురిని గ్రాండ్ ఫినాలేకు ఎంపిక చేశారు న్యాయనిర్ణేతలు. రఘు, చిరంజీవి, సుంకపాక ధరణి, బైరగోని చంద్రం నలుగురు గ్రాండ్ ఫినాలేలో ఎవరు టైటిల్ విజేతో తేలనుంది. మరింత ధూంధాంగా ముస్తాబై గ్రాండ్ ఫినాలే సిద్ధమైంది. రేపు రాత్రి 8:10 గంటలకు 10టీవీలో తప్పక చూడండి.