మరో డేరా భక్తుడి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

 మరో డేరా భక్తుడి ఆత్మహత్య

September 10, 2017

రేప్ బాబా డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం అనుచరుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. డేరా సచ్చా సౌదాకు చెందిన ఓ స్టార్ హోటల్లో రూ. 3 కోట్ల పెట్టుబడులు పెట్టిన నష్టపోయిన చక్రీ దాద్రి సోమవీర్ అనే హరియాణాకు చెందిన భక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. అతడు గతంతో డేరా సచ్చాకు 12 ఎకరాల భూమిని కూడా రాసిచ్చారు. బుధవారం నుంచి చక్రి కనిపించకుండా పోయాడని, శుక్రవారం రాత్రి అతని శవం ఓ గ్రామంలో దొరికిందని బంధువులు చెప్పారు. డేరా హోటల్లో పెట్టుబడులు పెట్టేందుకు చక్రి తన 25 ఎకరాల భూమిని అమ్మేశాడని, మాంచి లాభాలు వస్తాయని బాబా ఆయనను మోసం చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గుర్మీత్ రేప్ కేసులో జైలుకెళ్లడంతో ఆయన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.