ఆన్‌లైన్‌లో బీరు డెలివరీ.. చివరికి ఇలా..
చాలా మందికి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు శ్రమను తగ్గిస్తున్నాయి. ఏది కావాలన్నా.. ఏం తినాలన్నా నిమిషాల్లో మన వద్దకు చేరిపోతున్నాయి. దీన్నే ఓ యువకుడు అడ్డదారి పట్టించాడు. మద్యం నిషేదాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని మందుబాబులకు స్విగ్గి డెలివరీ బాయ్ కావాల్సినప్పుడల్లా మద్యం సరఫరా చేయడం ప్రారంభించాడు. గుజరాత్‌లో డెలివరీ బ్యాగులో మద్యం సరఫరా చేస్తుండగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది.
వడదరలో ‘ రాహుల్ సింగ్ మహిదా’ అనే యువకుడు స్విగ్గి ఫుడ్ డెలివరీలో ఏడు నెలల క్రితం చేరాడు. కొన్ని రోజులపాటు ఫుడ్ డెలివరీ చేశాడు. తర్వాత వీరేంద్ర సింహతో పరిచయం ఏర్పడింది. వీరద్దరు కలిసి సరికొత్త ఎత్తుగడ వేశాడు. ఆన్‌లైన్ ఆర్డర్‌లో మద్యం సరఫరా చేయడం ప్రారంభించారు. ఫంక్షన్లు, బయటకు వెళ్లి మందు తెచ్చుకోలేని మందుబాబులకు మద్యం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఇది తెలిసిన వారంతా అతడికి ఫోన్ చేసి మద్యం తెప్పించుకోవడం ప్రారంభించారు. స్విగ్గి బ్యాగులో బీర్లు పెట్టుకొని రహస్యంగా కావాల్సిన వారికి చేరవేసేవాడు. తనిఖీల్లో భాగంగా పోలీసులు అతడి బ్యాగు పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు పోలీసులు. ఇంకా వీరేంద్ర పరారీలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.