ఫుడ్ డెలివరీ మహిళా ఏజెంట్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫుడ్ డెలివరీ మహిళా ఏజెంట్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

November 11, 2019

ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు అవసరం అని చాలా మంది అనుకుంటారు. కానీ మనం చేసే పని కూడా కొన్నిసార్లు అనుకోని అవకాశాలను కల్పిస్తుందని మరోసారి రుజువైంది. త్వరలో జరగబోయే కర్నాటక కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జొమాటో డెలివరీ ఏజెంట్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిది. మంగళూరు సిటీ కార్పోరేషన్‌లోని మన్నగూడ వార్డు నుంచి ఆమెను బరిలో నిలిపింది. ఫుడ్ డెలవరీ ఏజెండ్‌గా ఉన్న మేఘనా తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు ఫుడ్ డెలవరీ చేసే యువతి ఇప్పుడు తన ప్రయాణాన్ని మార్చుకుంది. 

Food Delivery Women.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని కాదనుకోలేక తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు మేఘన చెబుతున్నారు. నేను ప్రతి రోజు విధి నిర్వహణలో భాగంగా రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. అలా  నా ప్రయాణంలో రోడ్లు పాడైపోయి కనిపిస్తుంటాయి. వాటి వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. రోడ్డు భద్రత అనేది చాలా సమస్యగా మారిపోయి కనిపించేది అని చెబుతోంది. అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని అంటోంది. 

Food Delivery Women..

కాగా  కాంగ్రెస్ అభ్యర్థిగా అక్టోబర్ 31 న నామినేషన్ వేసిన ఆమె వార్డులో తన మద్దతుదారులతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలను దగ్గర ఉండి చూసిన తాను ఈసారి విజయం సాధిస్తానని ధీమాగా చెబుతోంది.మరోవైపు మేఘనా టెక్నికల్ ఎగ్జిక్యూటివ్‌గా తన వృత్తిని ప్రారంభించింది. ఆ తరువాత జోమాటోకు ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా మారి ఇప్పుడు రాజకీయ సంగ్రామంలోకి అడుగుపెట్టింది.