మునిసిపాలిటీ బంపర్ ఆఫర్.. కిలో చెత్తకు ఫుల్ మీల్స్.. అరకిలోకు టిఫెన్  - MicTv.in - Telugu News
mictv telugu

మునిసిపాలిటీ బంపర్ ఆఫర్.. కిలో చెత్తకు ఫుల్ మీల్స్.. అరకిలోకు టిఫెన్ 

July 19, 2019

Ambikapur launches India's.

కాలుష్య భూతాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. రీసైక్లింగ్, సబ్సడీ ప్రోత్సాహకాలు వంటివెన్నో అందిస్తున్నాయి. అయినా పెద్దగా ఫలితాలు రావడం లేదు. ఇటీవల ఓ స్కూల్లో ప్లాస్టిక్ కవర్లను ఫీజుగా తీసుకోవడం ప్రారంభించారు. అదే బాటలో ఓ మునిసిపాలిటీ అధికారులు కూడా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎవరైనా సరే కిలో చెత్త తీసుకొచ్చి ఇస్తే వారికి కడుపు నిండా భోజనం పెడతామని, అరకిలో చెత్త తెస్తే టిఫిన్ పెడతామని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అంబికాపూర్ మునిసిపాలిటీ ఆ ఆఫర్ ప్రకటించింది. 

దేశంలో ఇండోర్ తర్వాత అత్యంత శుభ్రమైన పట్టణంగా పేరుకెక్కింది అంబికాపూర్. తాజాగా చెత్తకు చెక్ పెట్టడానికి ‘గార్బేజ్ కఫే’ పేరుతో హోటల్ ప్రారంభించింది. దేశంలో ఇలాంటిది మరెక్కడా లేదు. ఈ హోటల్‌కు తీసుకొచ్చిన చెత్తాచెదారాన్న రోడ్లనిర్మాణానికి వాడతామని అధికారులు చెప్పారు. దీంతోపాటు ప్లాస్టిక్ సేకరించే పేదలకు ఇళ్లు కట్టి ఇచ్చే ఆలోచన కూడా ఉందని మేయర్‌ అజయ్‌ చెప్పారు.