Food poison at minority girls gurukul school students in siddipet district
mictv telugu

చికెన్ గ్రేవీతో వంకాయ కర్రీ.. 128 మంది విద్యార్థినులకు అస్వస్థత

June 27, 2022

Food poison at minority girls gurukul school students in siddipet district

సిద్దిపేట జిల్లాలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కలుషితమై మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 128 మంది విద్యార్థినులు.. నిన్న అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాల సమస్యతో అవస్థలు పడ్డారు. దీంతో వెంటనే గురుకుల పాఠశాల వసతిగృహంలోనే విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

పాఠశాలలో మొత్తం 326మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్‌తో భోజనం వడ్డించారు. మిగిలిన గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయలో కలిపి వడ్డించారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయాన్నే నిర్వాహకులు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన చేరుకొని అక్కడే చికిత్స ప్రారంభించారు. అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, సంబంధిత నివేదికను మైనారిటీ గురుకులాల రాష్ట్ర అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.