పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్.. 30 మంది... - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్.. 30 మంది…

May 19, 2019

Food Poison In Marriage function At nagarkurnool district.. 30 people Injured

పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని గట్టునెల్లికుదురులో ఆదివారం ఓ వివాహం జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు హాజరైన బంధువులంతా అక్కడ ఏర్పాటు చేసిన భోజనం తిన్న 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

దీంతో వారిని నాగర్ కర్నూల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. చికిత్స నిర్వహించిన వైద్యులు.. పెళ్లి వేడుక విందులో ఫుడ్ పాయిజన్ అయినట్లు పేర్కొంటున్నారు. ఈ 30 మందిలో బొందమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.