Food poisoning in Basara iiiT.. 600 students sick
mictv telugu

బాసర iiiTలో ఫుడ్ పాయిజన్.. 600 మంది విద్యార్ధులకు అస్వస్థత

July 15, 2022

సౌకర్యాల పేరుతో ఇటీవల ఆందోళన చేసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు శుక్రవారం ఆహారం కలుషితమై అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వడ్డించిన ఎగ్ ఫ్రైడ్ రైస్ కలుషితం కావడంతో సుమారు 600 మంది విద్యార్ధులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోవడంతో వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. విద్యార్ధుల సంఖ్య ఎక్కువుండడంతో నిర్మల్, భైంసా నుంచి వైద్యులను రప్పించారు.