పెళ్లి విందులో కుల వివక్ష.. మైక్‌లో ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి విందులో కుల వివక్ష.. మైక్‌లో ప్రకటన

May 16, 2022

పెళ్లికి వచ్చిన అతిథులను.. భోజన సమయంలో కులాల వారీగా కూర్చొని తినాలంటూ ఓ వ్యక్తి లౌడ్ స్పీకర్లో అనౌన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 12 న హిమాచల్ ప్రదేశ్, సిర్మౌర్ జిల్లాలో జరిగిందీ సంఘటన. ఈ వీడియోను ఓ యువకుడు “శిల్లాయీ ప్రాంతంలోని పరిస్థితి ఇది.. కుల వివక్ష, అంటరానితనాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నారో చూడండి” అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

వీడియోను చూసిన దళిత్ శోషణ ముక్తి మంచ్ దీనిని తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వీర్ బహదూర్ తెలిపారు.