foods-to-avoid-on-an-empty-stomach
mictv telugu

పరగడుపున వీటిని అస్సలు తినొద్దు

March 6, 2023

పొద్దున లేవగానే మనం ఏం తింటామో దాన్ని బట్టే మన రోజంతా డిసైడ్ అవుతుంది. హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ లేకుండా హాయిగా ఉంటాం. అలా కాకుండా ఇష్టం వచ్చినది తిన్నామో అంతే…రోజంతా గడబిడే. అందుకే, ఉదయాన్నే తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి. అయితే ఉదయాన్నే ఏ ఫుడ్ తీసుకోకూడదో చాలా మందికి తెలియదు. అలాంటివారి కోసమే

కాఫీ, టీ:

చాలా మంది ఉదయాన్నే వేడివేడి పొగలు కక్కే కాఫీ, టీతో స్టార్ట్ చేస్తారు. ఇది తాగేటప్పుడు మాంచి రీఫ్రెష్‌ ఫీల్‌ని ఇస్తుందేమో.. కానీ, ఆ తర్వాత ఇది చాలా సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. అంతే కాకుండా డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. వీటి బదులు నీరు తాగడం మంచిదని చెబుతున్నారు. లేదా, రాత్రి పూట నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను తీసుకోవచ్చు. ఆ తర్వాత టీ, కాఫీ తీసుకుంటే సమస్యలు రావు. అలాగే ఉదయాన్న లేస్తూనే ఐస్ టీ, కోల్డ్ కాఫీ ల్లాంటివి తాగడం కూడా మంచిది కాదు. వీటిని ఏ సమయంలో తీసుకున్నా మంచి రిలాక్సేషన్ ఉంటుంది. కానీ, ఖాళీ కడుపుతో మాత్రం తీసుకుంటే మాత్రం కడుపులో శ్లేష్మ పొర దెబ్బతిని జీర్ణ క్రియ మందగిస్తుంది.

కూల్ డ్రింక్స్:

కూల్ డ్రింక్స్‌ని కూడా ఖాళీ కడుపుతో తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల వికారం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, వీటికి ఎంత దూరం ఉంటే మంచిదని చెబుతున్నారు. మామూలుగానే కూల్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయడం మంచిది.

పచ్చి కూరలు:

పచ్చి కూరగాయలతో చాలా మంది సలాడ్స్ చేసుకుని తింటారు. దీని వల్ల బరువు తగ్గుతారు. కానీ, ఖాళీ కడుపుతో తింటే మాత్రం జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి కడుపునొప్పికి కారణమవుతుంది.

కారం పదార్ధాలు:

ఉదయాన్నే స్పైసీ ఫుడ్ తింటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. సాధారణంగా ఇది మామూలు సమయంలోనే అస్సలు మంచిది కాదు. ఇక ఖాళీ కడుపుతో తింటే లైనింగ్‌లో ఇబ్బంది ఏర్పడి అసిడిటీకి కారణమవుతుంది.

సిట్రస్ ఫ్రూట్స్:

ఖాళీ కడుపుతో సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం ఎక్కువగా యాసిడ్ రిలీజ్ అవుతుంది. వీటిని ఖాళీ కడుపు తినడం వల్ల కడుపులో భారంగా ఉంటుంది. సాధారణంగా ఇవి మంచివే. కానీ, ఖాళీ కడుపుతో తినడం అస్సలు మంచిది కాదని దీని వల్ల కడుపులో సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.