foods to stay energetic all day
mictv telugu

ఇవి తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు

February 20, 2023

foods to stay energetic all day

రాత్రి డిన్నర్ తిన్నాక మళ్ళీ ఉదయం లేచేంతవరకు ఏమీ తినము. దాదాపు ఎనిమిది నుంచి పది గంటలు ఏమీ తినము. ఖాళీ కడుపుతో ఉంటాము. అందుకే ఉదయాన్నే తినే ఫుడ్స్ మనకి ఎనర్జీ ఇచ్చేలా ఉండాలి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ బిజీగానే ఉంటున్నారు. క్షణం తీరిక లేకుండా పనులు చేస్తూనే గడుపుతున్నారు. కాబట్టి శరీరం మీద తగిన శ్రద్ధ పెట్టడం లేదు. ఏది దొరికితే అది తినేస్తున్నారు. కానీ ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ రోజంతా ఉత్సాహాన్నిచ్చేదిలా ఉండాలి. మన ఫాస్ట్ ను బ్రేక్ చేస్తుంది కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాలి.మరి అలాంటి ఫుడ్ ఏంటో మీకు తెలుసా…. ఏది తీసుకుంటే స్ట్రెంత్ ఇస్తుందో తెలుసుకుందాం రండి.

ప్రొటీన్ బార్స్:

ఆహారంలో అన్నింటికంటే ప్రొటీన్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడే మన శరీరం బాగా పనిచేస్తుంది. దీని కోసం ప్రొటీన్ బార్స్ తీసుకోవచ్చును. వీటిని తీసుకోవడం వల్ల మీకు అప్పటికప్పుడే శక్తిని అందిస్తుంది. జర్నీలో ఉన్నప్పుడు కూడా వీటిని క్యారీ చేసి తినొచ్చు. కావాలంటే వీటిని స్నాక్ టైమ్‌లో కూడా తినొచ్చు.

అవిసెలు:

వీటిని పొడిలా చేసి ఉప్మా, ఇడ్లీ, సలాడ్‌పై చల్లి ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. వీటిని డైట్‌లో చేర్చడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకి ఆరోగ్యాన్నిస్తాయి. కాబట్టి కచ్చితంగా వీటిని డైట్‌లో చేర్చుకోండి.

ఎగ్స్:

మార్నింగ్ ప్రోటీన్ తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు ప్రోటీన్‌కి బెస్ట్ సోర్స్. దీంతో పాటు మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

హోల్ గ్రెయిన్ బ్రెడ్:

చాలా మందికి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తినే అలవాటు ఉంటుంది. కానీ నార్మల్ బ్రెడ్ కంటే హోల్ గ్రెయిన్ బ్రెడ్ తింటే ఎన్నో లాభాలు ఉంటాయి. ఎందుకంటే నార్మల్ బ్రెడ్ కంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ, బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచివి. ఈ బ్రేక్‌ఫాస్ట్ త్వరగా అవుతుంది కూడా. వీటిని కొన్ని ఆకుకూరలతో కలిపి తీసుకోవచ్చు. హెల్దీగా టోస్ట్‌లా చేసి తినొచ్చు.

మొలకలు:

మొలకలు తినడం కూడా చాలా మంచిది. వీటిలో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. ఇవి తినడం వల్ల కడుపు నిండుగా ఫీల్ వస్తుంది. అదే విధంగా మలబద్దకం సమస్య దూరమవుతుంది. జీవక్రియను పెంచడంలో కూడా సాయపడతాయి.