ముంబైలో కూలిన ఫుట్‌ఓవర్ బ్రిడ్జి.. నలుగురి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ముంబైలో కూలిన ఫుట్‌ఓవర్ బ్రిడ్జి.. నలుగురి మృతి

March 14, 2019

ముంబైలో ఘోరం ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్టీ) రైల్వేస్టేషన్‌ సమీపంలో పాదచారుల వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందగా.. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. 

 

 

ఈ వంతెనను ఈ స్టేషన్ నుంచి అజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ వరకు నిర్మించారు. గురువారం సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఒక్కసారిగా వంతెన కూలింది. దీంతో ప్రయాణికులంతా భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద ప్రయాణికులు చిక్కకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో ఘటనా స్థలం సమీపంలో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది.

2017 సెప్టెంబర్‌లో ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లో పాదచారుల వంతెన కూలి 22 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే.