రౌడీ షీట‌ర్ అంత్య‌క్రియ‌ల్లో వివాదం.. ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ దారుణ హ‌త్య‌ - MicTv.in - Telugu News
mictv telugu

రౌడీ షీట‌ర్ అంత్య‌క్రియ‌ల్లో వివాదం.. ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ దారుణ హ‌త్య‌

June 1, 2022

ఓ రౌడీ షీట‌ర్ అంత్య‌క్రియ‌ల్లో మొదలైన చిన్న వివాదం ఆకాశ్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ ప్రాణాన్ని తీసింది. ఈ దారుణ ఘ‌ట‌న విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ కాల‌నీలో జ‌రిగింది. రెండురోజుల క్రితం వాంబే కాలనీలో టోని అనే రౌడీ‌షీటర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అంత్యక్రియల సమయంలో ఆకాశ్, ప్రభాకర్ గ్యాంగ్‌ల మధ్య వివాదం చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడం.. ఆ తర్వాత పోలీసులు వస్తున్నారని తెలియడంతో రెండు గ్యాంగులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆకాశ్‌ గురునానక్‌కాలనీలోని తన స్నేహితుడి గదికి వెళ్లాడు.

ఆ విషయం తెలుసుకున్న ప్రభాకర్ గ్యాంగ్.. మంగళవారం రాత్రి అక్కడికి చేరుకుకన్నారు. ఆకాశ్ మద్యం మత్తులో నిద్రపోతున్నాడని గమనించి.. ఆగదిలో ఉన్న మరో ముగ్గురిని బెదిరించి బయటకు పంపించేశారు. అనంతరం ఆకాశ్‌ను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశారు. అరగంట తర్వాత పారిపోయిన స్నేహితులు వచ్చి రక్తపుమడుగులో ఉన్న ఆకాశ్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా… అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఆకాశ్‌ శరీరంపై మొత్తం 16 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న అతని మిత్రులు 50 మందికి పైగా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆకాశ్‌కు తండ్రి, తల్లి, సోదరి ఉన్నారు.