ఇద్దరు పిల్లలు పుట్టాక ఫుట్ బాల్ స్టార్ పెళ్లి..! - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరు పిల్లలు పుట్టాక ఫుట్ బాల్ స్టార్ పెళ్లి..!

July 1, 2017

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబసభ్యుల సమక్షంలో చిన్ననాటి ప్రేయసి, సహజీవన భాగస్వామి ఆంటోనెల్లా రొకుజ్జోను పెళ్లిచేసుకున్నాడు. సుమారు 250 మంది ప్రపంచ సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకలో మెస్సీ… ఆంటోనెల్లా వేలికి వెడ్డింగ్‌ రింగ్‌ తొడిగి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. సొంత నగరం అత్యంత విలాసవంతమైన రొసారియో ఈ పెళ్లి వేడుకకు వేదిక అయింది.

పదేళ్లుగా మెస్సీ, ఆంటోనెల్లా రొకుజ్జో సహజీవనం చేస్తున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు తియాగో, మాటియో మెస్సీలు ఉన్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వెడ్డింగ్‌కు హాలీవుడ్తో పాటు ప్రపంచ ఫుట్ బాల్ ఆటగాళ్లు నైమర్, లూయిస్ సువరేజ్ సహా పలువురు హాజరు అయ్యారు. బార్సిలోనా స్టార్ గెరార్డ్ పికి, పాప్‌ గాయని షకీరా సైతం వచ్చారు. ఇక వివాహ వేడుకలో స్పెయిన్‌ డిజైనర్‌ రోసా క్లారా రూపొందించిన సొగసైన డిజైనర్‌ గౌన్‌లో ఆంటోనెల్లా రొకుజ్జో మెరిపోయింది.