పేదరికంతో ఆటను మధ్యలోనే వదిలేసింది. క్రీడల నుంచి తప్పుకొని ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తున్నది. అయినా కూడా ఆటను మాత్రం వదిలేయకుండా ప్రాక్టీస్ చేస్తున్నది బెహలాకి చెందిన పౌలోమీ.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫుట్ బాల్ ఆడింది పౌలోమీ. తీవ్ర పేదరికం, ఇతర గాయాలు ఆమెను ఆటకు దూరం చేశాయి. ఫుట్ బాల్ ఆటను ఆడకుండా చేశాయి. ఇప్పుడు ఆమె కథ సోషల్ మీడియా ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఫుడ్ డెలివరీ చేస్తున్న ఆమె గురించి ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నది.
24 యేండ్ల ఆమె ఫుడ్ డెలివరీ చేస్తుంది. 12 గంటల షిఫ్ట్ తర్వాత ఫుట్ బాల్ ఆడేందుకు రోజుకు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తున్నది. ఇప్పటికీ భారతదేశం తరుపున ఆడేందుకు పౌలోమీ కలలు కంటున్నది. ఆమె పట్టుదల, సంకల్పం గురించి నెట్టింట అందరికీ తెలిసింది. దీంతో ఆమెను ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ (ఐఎఫ్ఏ) పిలిచింది.
ఇతర అధికారులతో సమావేశం కూడా కావాల్సింది ఉంది.
పౌలోమీ పని చేయడం ప్రారంభించినప్పుడు కోవిడ్ కాలంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ గరిష్ట స్థాయికి చేరుకుంది. మోటర్ సైకిళ్లు, స్కూటర్లు అద్దెకు తీసుకొని సైకిల్ కొనడానికి సరిపడా డబ్బు సంపాదించడం ప్రారంభించింది. ఆమె రోజుకు 200 నుంచి 300 రూపాయల వరకు సంపాదించేది. ఇప్పుడు ఒక సైకిల్ కొనుక్కుంది. ఇప్పుడు డెలివరీకి సగటున 20 నుంచి 30 రూపాయలు సంపాదిస్తానంటున్నది పౌలోమీ. ఆమె చారుచంద్ర కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్నది. ఆమెకు రెండు నెలల వయసు ఉన్నప్పుడే చనిపోయింది. దీంతో మేనత్త, మామల దగ్గరే పెరుగుతుంది. స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరిగిన 2016 హోమ్ లెస్ వరల్డ్ కప్ లో ఆమె భారత జట్టుకు ప్రతినిధిగా వ్యవహరించింది. ఆ ఆటలో వాళ్ల జట్టు విజయం సాధించింది.
Thanks for bringing it up. Let's hope plight of such sportspeople is discussed in national media.
— Amitabha Saha (@asaha71) January 10, 2023
‘పౌలోమీ చాలా ప్రతిభావంతురాలు. నేను ఆమెకు 14 సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్నా. పేదరికం ఆమె ఆటకు అడ్డుగా ఉంది. ఆమె శ్రీలంకంలోని కొలంబోలో జరిగిన 2013 ఏఎఫ్సీ (ఆసియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్) క్వాలిఫైయర్ లో మహిళల జూనియర్ జాతీయ అండర్ 16 జట్టులో పాల్గొంది’ అనితా సర్కార్ బెహలాలో నివసిస్తున్న ఫుట్బాల్ కోచ్ తెలిపారు. ‘మొదట్లో నేను అర్ధరాత్రి పని చేయడానికి భయపడ్డాను. కానీ నేను ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు ఎదురుకాలేదు. నేను మళ్లీ ఎప్పటికైనా భారతదేశం తరుపున ఫుట్ బాల్ ఆడి తీరుతాను’ అంటున్నది పౌలోమీ.