డేంజర్ ఫుట్‌పాత్.. నడుస్తుండగానే కూలిపోయింది..! - MicTv.in - Telugu News
mictv telugu

డేంజర్ ఫుట్‌పాత్.. నడుస్తుండగానే కూలిపోయింది..!

October 26, 2019

Footpath ..

ఈ వీడియోను చూస్తే ఇంకోసారి ఫుట్‌పాత్‌పై నడవాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటి వరకూ అంతా బాగానే కనిపించినా రెప్పపాటులో ఊహించని ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఓ దుకాణంలోకి వెళ్లి బయటకు వస్తుండగా ఓ ఫుట్‌పాత్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఫుట్‌పాత్ కూలిపోవడంతో అక్కడున్న వాహనాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఏం జరిగిందో అని స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డు అయింది. 

ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ షాపులోకి వెళ్లి వస్తుండగా దుకాణం ముందు ఉన్నడ్రైనేజీపై నిర్మించిన ఫుట్‌పాత్ ఒక్కసారిగా కుంగిపోయింది. వెంటనే దానిపై నిల్చున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను నజీర్ మహ్మద్, పర్వేజ్ ఖాన్లుగా గుర్తించారు.వీరితో పాటు ఫుట్ పాత్‌పై నిలిపిన బైక్ ఇతర వస్తువులు డబ్బాలు అన్ని కూడా అందులో పడిపోయాయి. సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికారులు వారిని హాస్పిటల్‌కు తరలించారు. నాణ్యత లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.