లేడీ పోలీసులు ఇక చీర కట్టొద్దు.. యాక్షన్ కష్టం - MicTv.in - Telugu News
mictv telugu

లేడీ పోలీసులు ఇక చీర కట్టొద్దు.. యాక్షన్ కష్టం

October 22, 2018

మన దేశంలో మహిళాపోలీసుల వస్త్రధారణ రకకాలుగా ఉంటుంది. కొందరు చీరలు కడతారు, కొందరు ప్యాంట్లు వేసుకుంటారు. హోదాలను బట్టి అలా ధరిస్తుంటారని భావిస్తుంటాం. అయితే నేరాలు జరిగినప్పుడు చీర పోలీసులకు కాస్త ఇబ్బందే. నిరసనకారులను అదుపు చేసేటప్పుడు చీర పోలీసుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి కారణాలతోనే ఇకపై లేడీ పోలీసులందరూ తప్పనిసరిగా ప్యాంట్లు, చొక్కాలే వేసుకోవాలని కర్ణాటక డీజీపీ నీలమణి రాజు ఆదేశించారు.

ee

‘మహిళా పోలీసులు ఖాకీ ప్యాంటు, షర్టు, బెల్టు, బూట్లు వేసుకోవాలి. చీర కంటే ప్యాంటు, షర్టు సౌకర్యంగా ఉంటాయి. నేరం జరిగినప్పుడు త్వరగా యాక్షన్ తీసుకోవచ్చు.. ’ అని  డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా పోలీసు అధికారులతోపాటు  సీనియర్ పోలీసుల అధికారులతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో 5 వేల మంది మహిళా పోలీసులు ఉన్నారు. కాగా, రిజర్వ్ పోలీసు అధికారులు కూడా చీరను ఇటీవల నిషేధించారు.