గ్రూప్-1 ఉద్యోగాలకు.. 2 లక్షల దరఖాస్తులు - MicTv.in - Telugu News
mictv telugu

గ్రూప్-1 ఉద్యోగాలకు.. 2 లక్షల దరఖాస్తులు

May 25, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి అధికారులు దరఖాస్తుల వివరాలను వెల్లడించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. నేటివరకు 200428 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరాలను వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు ఈ నెల 31న ఆఖరి తేదీ కావడంతో అభ్యర్థులు విపరీతంగా దరఖాస్తులు చేస్తున్నారని, దరఖాస్తుల గడువు ఇంకా ఆరు రోజులు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ఓటీఆర్ విషయానికొస్తే.. నేటి వరకు కొత్తగా 1,90,710 మంది ఓటీఆర్ నమోదు చేసుకున్నారని, మరో 200070 మంది అభ్యర్థులు ఓటీఆర్ ఎడిట్ చేసుకున్నారని పేర్కొన్నారు.

తాజాగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి, రెండేళ్ల వయోపరిమితితోపాటు, దరఖాస్తుల గడువును కూడా కేసీఆర్ సర్కార్ పెంచింది. ఈ క్రమంలో గ్రూప్ -1 డీఎస్సీ పోస్టులకు కూడా వయోపరిమతిని పెంచి, ఎత్తును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని అధికారులు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్ -1 ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఏర్పాట్లను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. దరఖాస్తుల గడువు ముగియగానే పరీక్షల షెడ్డ్యూల్‌ను ప్రకటించనున్నారు.