సీఏఏ, ఎన్నార్సీ డోన్ట్ కేర్, మంచి సెక్స్ కావాలంతే.. సర్వే - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏ, ఎన్నార్సీ డోన్ట్ కేర్, మంచి సెక్స్ కావాలంతే.. సర్వే

February 14, 2020

Dating

యువతీ యువకుల డేటింగ్‌లపై పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్నార్సీ) లాంటి వివాదాస్పద చట్టాలు పెద్దగా ప్రభావం చూపడం లేదని ‘ఓకే కుపిడ్‌’ సంస్థ వెల్లడించింది. రెండు లక్షల మంది యువతీ యువకుల అభిప్రాయాలను సేకరించామని సదరు సంస్థ తెలిపింది. యువకులు, యువతులు భిన్నంగా స్పందించారు. సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకించేవారితో డేటింగ్‌ చేస్తారా ? అన్న ప్రశ్నకు 56 శాతం మంది యువకులు చేస్తామని చెప్పగా, 20 శాతం మంది చెప్పలేమని, 24 శాతం మంది ఏదీ కచ్చితంగా చెప్పలేమని చెప్పారు. 

అదే ప్రశ్న యువతులను అడగ్గా చేస్తామని 39 శాతం మంది, చేయమని 30 శాతం మంది, చెప్పలేమని 31 శాతం మంది తెలిపారు. రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారా, సెక్స్‌కు ప్రాధాన్యత ఇస్తారా? అని ప్రశ్నించగా.. ‘గుడ్‌ సెక్స్‌’కే ఎక్కువ  ప్రాధాన్యత ఇస్తామని ఎక్కువమంది చెప్పారు. అమెరికాకు చెందిన యువతీ, యువకులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా చెప్పారు. రాజకీయాల విషయమై ఏకీభావం కుదిరితేనే డేటింగ్‌ అయినా, పెళ్లయినా అని 70 శాతం మంది చెప్పారు. రాజకీయ విభేదాలుంటే కలిసి ఉండడం కష్టమని వారు తెలిపారు. 

అలాగే సీఏఏ, ఎన్నార్సీ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై చర్య తీసుకోవడం సమంజసమా ? అని ప్రశ్నించగా, 18 శాతం మంది మగవాళ్లు సమంజసమని, 21 శాతం మంది కాదని, కొన్ని కేసుల్లో మాత్రమే చర్య తీసుకోవచ్చని 37 శాతం మంది, ఏం చెప్పలేమని 18 శాతం మంది అన్నారు. అదే ప్రశ్నకు యువతులు 14 శాతం సబబు అని, 31 శాతం మంది సరికాదని, కొన్ని కేసుల్లో సబబు అని 36 శాతం మంది,  19 శాతం మంది ఎటూ చెప్పలేమని అన్నారు. డేటింగ్ సమయంలోగానీ, డిన్నర్‌ టేబుల్‌పై గానీ, బెడ్‌ రూముల్లో గానీ తమ భాగస్వామితో రాజకీయాలు మాట్లాడమని 60 శాతానికి పైగా యువతీ యువకులు చెప్పారు.