మెడికల్, ఇంజనీరింగు విద్యార్థులకు.. సబితా ఇంద్రారెడ్డి తీపికబురు - MicTv.in - Telugu News
mictv telugu

మెడికల్, ఇంజనీరింగు విద్యార్థులకు.. సబితా ఇంద్రారెడ్డి తీపికబురు

June 7, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇంటర్ పూర్తి చేసి, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఓ తీపికబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్, ఇంజనీరింగు విద్యను అభ్యసించాలని కళలు కంటున్న వారికి ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తున్నటు చెప్పారు. నీట్, ఎంసెట్, జేఈఈ, సీఏసీపీటీ రాస్తున్న విద్యార్థుల కోసం ఆన్లైన్ కోచింగ్‌ను సోమవారం ఆమె ప్రారంభించారు.

హైదరాబాద్‌లో తన కార్యాలయం ఆమె విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు విషయాలపై చర్చలు జరిపి, విద్యార్థులు మెడికల్, ఇంజనీరింగుల కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వెళ్లి, డబ్బులు వృథా చేసుకోకుంగా ఉచితంగా ఆన్‌లైన్‌లో కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..”విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ,వచ్చే పోటీ పరీక్షల్లో సత్తా చాటాలి. గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఆన్లైన్ శిక్షణకు తెలంగాణ విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులు వినియోగించుకొని ఉత్తమ ర్యాంకులు సాధించారు. మెడికల్, ఇంజనీరింగు చదవాలని ఆసక్తి ఉన్నవారు http://tscie.ranks.io లింక్ ద్వారా కోచింగ్ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చు” అని ఆమె అన్నారు.

ఈ కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొని, ఉచిత శిక్షణ ఆన్లైన్ కోచింగ్‌ను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని, వచ్చే పోటీ పరీక్షల్లో సత్తా చాటాలని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.