కొత్త జిల్లాలకు.. కోడ్‌లు కేటాయింపు: కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త జిల్లాలకు.. కోడ్‌లు కేటాయింపు: కేంద్రం

April 6, 2022

ngfnfg

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సోమవారం రోజున ప్రారంభించిన విషయం తెలిసిందే. 13 జిల్లాలుగా ఉన్నా ఏపీ.. 26 జిల్లాలుగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జిల్లాలకు బుధవారం కోడులను కేటాయించింది.

పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్‌లను కేటాయించింది. రాష్ట్రాలతో కేంద్రం జరిపే పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో వీటిని వినియోగిస్తారని పేర్కొంది.