For Not wear Proper Dress Code Lecturer Hitting Intermediate Student In Bhadradri Kothagudem
mictv telugu

డ్రెస్సింగ్ బాలేదని లెక్చరర్ అమానుషం.. విద్యార్థి పరిస్థితి విషమం

July 5, 2022

For Not wear Proper Dress Code Lecturer Hitting Intermediate Student In Bhadradri Kothagudem

లెక్చరర్‌ దురుసు ప్రవర్తన విద్యార్థి ప్రాణాల మీదికి తెచ్చింది. డ్రెస్సింగ్ సరిగా లేదంటూ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచక్షణా రహితంగా చేయిచేసుకున్నాడు. విద్యార్థి తలను గోడకేసి కొట్టడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గురుకుల పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

గురుకుల పాఠశాలలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతున్న కార్తీక్ ను.. అతడి డ్రెస్సింగ్ సరిగా లేదని ఫిజిక్స్‌ లెక్చరర్‌ రాంబాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా విద్యార్థి తలను గోడకేసి కొట్టాడు. దీంతో విద్యార్థి పరిస్థితి విషమించడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్‌ తెలిపారు. దురుసుగా ప్రవర్తించిన లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి డిమాండ్‌ చేసింది.