ప్రత్యేక బస్సుల్లో కార్యాలయాలకు.. ప్రభుత్వ ఉద్యోగులకు.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రత్యేక బస్సుల్లో కార్యాలయాలకు.. ప్రభుత్వ ఉద్యోగులకు..

May 22, 2020

For offices in special buses, for government employees ..

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం మరిన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులు పనిచేసే కార్యాలయాలకు వెళ్లాలంటే ఉంటే సొంత వాహనాలపై వెళ్తారు. లేదంటే బస్సులు, క్యాబ్‌లను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో కరోనా మళ్లీ ప్రబలవచ్చు అనే దిశలో ప్రభుత్వం ఓ యోచన చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రేపటినుంచి ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి వెల్లడించారు.  ప్రభుత్వ ఉద్యోగులు వారి ఇళ్ల నుంచి కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రవీందర్‌ రెడ్డి తెలిపారు. 

ఉద్యోగులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలోని వివిధ చోట్ల నుంచి కార్యాలయాలకు వచ్చేవారికి ఈ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు తప్పనిసరిగా వారి గుర్తింపు కార్డు చూపిస్తేనే బస్సులోకి అనుమతిస్తారని.. నగరంలోని 32 మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు రవీందర్‌ రెడ్డి స్పష్టంచేశారు.