For one person..Corona, Monkeypox, HIV..Finally
mictv telugu

ఒకే వ్యక్తికి..కరోనా, మంకీపాక్స్‌,హెచ్‌ఐవీ..చివరికి

August 25, 2022

ప్రపంచవ్యాప్తంగా గతకొన్ని సంవత్సరాలుగా కొత్త కొత్త వ్యాధులు వ్యాపిస్తూనే ఉన్నారు. ఈ కొత్త వ్యాధుల్లో ముఖ్యంగా కరోనా మహమ్మారి ఒకటైతే, తాజాగా మంకీపాక్స్‌ కూడా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. యావత్ ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి రెండు సంవత్సరాలపాటు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి బారినపడిన లక్షలాది మంది ప్రాణాలు వదలగా, వ్యాధి నుంచి కోలుకున్న బాధితులు ఇప్పటికి అనేక అవస్థలు పడుతున్నారు.

 

 

ఇటువంటి సమయంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఓ ఆశ్చర్యకరమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తికి, ఒకేసారి.. కరోనా, మంకీపాక్స్‌తోపాటు హెచ్‌ఐవీ కూడా నిర్ధారణ అయ్యింది. దాంతో వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను జర్నల్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షన్‌లో వెల్లడించారు.

”ఇటలీ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే ఐదు రోజులపాటు స్పెయిన్‌కు వెళ్లి, మళ్లీ ఇటలీకి తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తికి ఏకకాలంలో మంకీపాక్స్‌, కరోనా, హెచ్‌ఐవీ వంటి వ్యాధులు సోకినట్లు మా పరిశోధనలో తేలింది. అతడు స్పెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత 36 సంవత్సరాల సదరు వ్యక్తికి జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, నడుము వాపు తదితర సమస్యలతో బాధపడటం మొదలైంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అతనికి మూడు రోజుల తర్వాత కరోనా సోకింది.

ఆ తర్వాత కొద్దిగంటల్లోనే సదరు వ్యక్తి ఎడమ చేతిపై దద్దుర్లతోపాటు బొబ్బలు కనిపించాయి. ప్రస్తుతం సిసిలీ తూర్పుతీరంలో ఉన్న కాటానియాలోని ఆసుపత్రికి తరలించి, ఆరోగ్య పరీక్షలు చేయగా..రిపోర్టుల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలింది. సదరు వ్యక్తి 2021లో హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోగా, నెగెటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం అతనికి సోకిన వ్యాధులను అదుపు చేయడానికి చికిత్స అందిస్తున్నాం” అని వెల్లడించారు.