ఆర్ఆర్‌బీ అభ్యర్థులకు.. రైల్యేశాఖ శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్ఆర్‌బీ అభ్యర్థులకు.. రైల్యేశాఖ శుభవార్త

June 11, 2022

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) ఎన్‌టీపీసీ సీబీటీ 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు దక్షిణ మధ్య రైల్యేశాఖ శుభవార్తను చెప్పింది. పరీక్ష విషయంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, పరీక్ష సెంటర్లకు సురక్షితంగా చేరేలా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆర్ఆర్‌బీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే శనివారం పరీక్షలు దగ్గరపడుతుండడంతో అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని, ఈ నిర్ణయం తీసుకుంది.

 

నేడు తిరుపతి-సేలం, సేలం-తిరుపతి (07675/07676), 12న తిరుపతి-సేలం (07441), 13న సేలం-తిరుపతి (07442), 13న షాలిమార్-సికింద్రాబాద్ (08025), 14న షాలిమార్-సికింద్రాబాద్ (08035), 16న సికింద్రాబాద్-షాలిమార్ (08026), 17న సికింద్రాబాద్-షాలిమార్ (08036) రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఏ తేదీన ఏ పరీక్ష అంటే..

సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌, చండీగఢ్‌, బిలాస్‌పూర్‌, ముంబై, గోరఖ్‌పూర్‌, రాంచీ, ముజఫర్‌పూర్‌లో..
జూన్‌ 12న లెవల్‌-5 పరీక్ష
జూన్‌ 13న లెవల్‌-2
జూన్‌ 14న లెవల్‌-3

అజ్మీర్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, చెన్నై, గువాహటి, జమ్ము -శ్రీనగర్‌, కోల్‌కతా, పట్నా, సిలిగురి, అలహాబాద్‌, మాల్దా, తిరువనంతపురంలో..
జూన్‌ 15న లెవల్‌ 5
జూన్‌ 16న లెవల్‌ 2
జూన్‌ 17న లెవల్‌ 17