టెన్త్ విద్యార్థులకు.. ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

టెన్త్ విద్యార్థులకు.. ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

April 22, 2022

04

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ పదోవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానున్న పదోవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో పాస్ లేకపోయినా, ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ, యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

పదోవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఈడీ బ్రహ్మానందరెడ్డి గురువారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాస్ లేకపోయినా హాల్ టికెట్ ఉంటే ప్రయాణానికి అనుమతించాలని పేర్కొన్నారు. గేట్ మీటింగ్ ద్వారా సిబ్బందికి తెలియజేయాలని ఆర్టీసీ అధికారులకు ఈడీ సూచించారు. ఇందుకోసం జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులను సంప్రదించి, అవసరమైన బస్సులు నడపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా 6, 22 లక్షల మంది విద్యార్థులు పదోవ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సమయంలో బస్సులు సమయానికి వస్తాయో లేదో అని ఎదురుచూడకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంపై జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.