హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి భక్తులకు సరికొత్తగా దర్శనమిస్తున్నాడు. తలకు పాగా (పగిడి)తో మరింత అందంగా కనిపిస్తున్నాడు. పగడితో మరింత శోభాయమానంగా వెలుగొందుతున్నాడు. పలు ప్రాంతాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరులకు తలకు పగిడి ఉండడాన్ని గమనించిన స్థానికులు రాకేష్ ముదిరాజ్, ముకేశ్ ముదిరాజ్.. మహాగణపతికి కూడా పగిడి ఉంటే బాగుంటుందని భావించారు. ఇదే విషయాన్నినిర్వాహకుల దృష్టికి తీసుకెళ్ళారు.
వారు పాగా (పగిడి) పెట్టేందుకు అంగీకరించడంతో బాహుబలి సినిమాలో పగిడిలను రూపొందించిన చార్మినార్‌కు చెందిన బృందం వద్దకు వెళ్లి విషయం చెప్పారు. మహాగణపతికి పగడి తయారుచేసేందుకు వారు ముందుకొచ్చి అందుకు అవసరమైన మెటీరియల్‌తో ఖైరతాబాద్ చేరుకున్నారు. 14 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉండే పగిడీని తయారు చేసి వినాయకుడికి అలంకరించారు. ఇప్పుడు పగడితో వినాయకుడు మరింత అందంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.