ఉడుత చేసిన పనికి.. మూడువేల ఇళ్లకు కరెంట్ బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

ఉడుత చేసిన పనికి.. మూడువేల ఇళ్లకు కరెంట్ బంద్

June 25, 2022

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఓ ఉడుత చేసిన పనికి మూడువేల ఇళ్లల్లో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రద్ధగా పనిచేస్తున్న ఉద్యోగులు పవర్ ఒక్కసారిగా కట్ అవ్వడంతో చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఓ ఉడుత కరెంట్ సరఫరాను నిలిపివేసిందని, పవర్ కట్ కారణంగా అనేక కార్యక్రమాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి అని నార్త్ కరోలినాకు చెందిన యుటిలిటీ కంపెనీ వివరాలను వెల్లడించింది.

”జూన్ 22న ఉదయం ఒక ఉడుత పవర్ సప్లై వైరింగ్‌లోకి వచ్చి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించింది. దాంతో దాదాపు అరగంట పాటు డౌన్‌టౌన్‌లోని వ్యాపార, ప్రభుత్వ కార్యాలయాలు, పౌరుల నివాసాలు సహా మొత్తం 3,000 మంది కస్టమర్లకు తీవ్ర ఇబ్బంది కలిగింది. పవర్ సప్లయ్‌కి ఆటంకం కలిగిన వెంటనే సిబ్బంది తీవ్రంగా శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఉడుత చేసిన పనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాల్లో ఇ-సేవల్లో డీడ్స్ రిజిస్టర్, ప్లానింగ్, ట్యాక్స్ కలెక్షన్స్, హెల్త్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ పరిపాలన, కుటుంబ న్యాయ కేంద్రం, ఎన్నికల సేవలు, ఆర్థిక సేవలు ప్రభావితమయ్యాయి” అని ఉత్తర కరొలినా విద్యుత్ సంస్థ వెల్లడించింది.