టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గతేడాది సంపాదన గురించి ఫోర్బ్స్ సంస్థ వివరాలు వెల్లడించింది. వేతనంతో పాటు కంపెనీ స్టాక్స్ విక్రయించడం ద్వారా మస్క్ 23.50 బిలియన్ డాలర్లు ఆర్జించినట్టు నివేదికలో పేర్కొంది. అంటే మన కరెన్సీలో రూ. 1,82,576 కోట్లు. అంటే తెలంగాణ బడ్జెట్ కంటే కొంచెం తక్కువ. 2018లో టెస్లా కంపెనీ కేటాయించిన స్టాక్స్‌లో కొంత భాగాన్ని అమ్మడం ద్వారా ఇంత ఆదాయం సాధ్యపడిందని నివేదిక వివరించింది.
మస్క్ తర్వాత 770.50 మిలియన్ డాలర్లతో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో న్విదియా సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ, నాలుగో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ రీడ్ హాస్టింగ్స్ ఉన్నారు. తెలుగు వ్యక్తి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 309.40 మిలియన్ డాలర్లతో జాబితాలో ఏడో స్థానంలో ఉన్నారు. అంతేకాక, తక్కువ అంచనాలున్న సీఈఓగా సత్య నాదెళ్ల నిలిచారు.