ఫోర్బ్స్ యువ శక్తిమంత సంపన్నుల్లో ఉపాసన, సింధు - MicTv.in - Telugu News
mictv telugu

ఫోర్బ్స్ యువ శక్తిమంత సంపన్నుల్లో ఉపాసన, సింధు

September 25, 2018

‘టైకూన్స్ ఆఫ్ టుమారో’ పేరుతో ఫోర్బ్స్ ఇండియా 22 మంది అత్యంత శక్తివంతమైన యువ సంపన్నుల జాబితాను ప్రకటించింది. ఇందులో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన,  ఒలంపిక్ విజేత పీవీ సింధులకు స్థానం దక్కింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న శక్తివంతమైన సంపన్నులుగా పేర్కొంది. వ్యాపారం, వాణిజ్యం, నటన, క్రీడలకు సంబంధించి, ఇండియాకు చెందినవారిని ప్రకటించింది. ఆయా రంగాల్లో వారు చూపుతున్న ప్రతిభ, కుటంబ వ్యాపారాలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తల శక్తి సామర్థ్యాలు, వారి వ్యాపకాలు, తొలితరం నటులు వంటి అంశాలనే పరిగణలోకి తీసుకుని జాడితా తయారు చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది.Forbes Younger young Rich Empowerment Upasana, sindhuఅంతేగానీ వారి వారి నికర సంపదను ప్రామాణికంగా తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఈ జాబితాలో  ఫ్యూచర్‌ కన్స్యూమర్ ఎండీ ఆశ్ని బియానీ, యస్ బ్యాంక్‌ సీఈఓ రాణా కపూర్‌ కుమార్తె రాధా కపూర్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెచ్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కరణ్‌ అదానీ, బిర్లా వారసురాలు అనన్య బిర్లా

ఇండియన్‌ ఎక్స్‌‌ప్రెస్‌ గ్రూప్‌ ఈడీ అనంత్‌ గోయెంకా, ఆగ్రోకు చెందిన నదియా చౌహాన్‌, క్లియర్‌ టాక్స్ ఫౌండర్ అర్చిత్‌ గుప్తా, లోధా గ్రూప్‌కు చెందిన అభిషేక్‌ లోధా

తదితరులకు కూడా ఈ జాబితాలో స్థానం లభించింది.