ఇప్పుడే ఆలయాలు తెరవాల్సిన అవసరమేంటి?: బీజేపీ నేత - MicTv.in - Telugu News
mictv telugu

ఇప్పుడే ఆలయాలు తెరవాల్సిన అవసరమేంటి?: బీజేపీ నేత

May 31, 2020

Open Temples.

పశ్చిమ బెంగాల్‌లో దేవాలయాలను తెరవాలన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి నిర్ణయం సరైనది కాదని, కరోనా వ్యాప్తి పట్ల అర్చకులు కూడా భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలను బలవంతంగా ఎందుకు తెరుస్తున్నారని ప్రశ్నించారు. కరోనా వంటి పరిస్థితుల్లో ఆలయాలు తెరవాల్సిన అవసరం ఏంటని అన్నారు. కాళీఘాట్ దేవాలయంలో అర్చకులు కరోనా వ్యాప్తి గురించి భయపడుతున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. 

తమ స్వస్థలాలకు కార్మికులు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించిందని పేర్కొన్నారు. ‘కార్మికులను తమ స్వస్థలాలకు రానివ్వడానికి రాష్ట్రప్రభుత్వం ఇష్టపడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను రాష్ట్రానికి రానివ్వకపోతే, వారికి చావే దిక్కు అవుతుంది. అందుకు బాధ్యత బీజేపీదా? ముస్లిం కార్మికులు తమ ఇళ్ళకు వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. రాష్ట్రంలో ఎవరూ అష్ట దిగ్బంధనం నిబంధనలను పాటించడం లేదు. ఇలాగే కొనసాగితే కరోనా కేసులు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలపాటు గవర్నర్, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, సమయాన్ని వృథా చేసింది’ అని తెలిపారు.