కెనడాలో విద్వేషపరమైన దాడులు.. పౌరులను హెచ్చరించిన భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

కెనడాలో విద్వేషపరమైన దాడులు.. పౌరులను హెచ్చరించిన భారత్

September 23, 2022

కెనడాలో నివసిస్తున్న భారత పౌరులకు విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హిందూ ప్రార్ధనా మందిరాలపైనా, మతపరమైన చిహ్నాలపైన దాడులు జరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటన జారీ చేసింది. విద్వేష పూరిత దాడులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం గురువారం కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా వారు అంతగా పట్టించుకున్నట్టు లేదు. దీంతో జాగ్రత్తగా ఉండాలని, రాజకీయ ప్రేరేపిత ఖలిస్థానీ అతివాద శక్తులను గమనిస్తూ ఉండాలని సూచించింది. కాగా, కెనడాలో పాక్ ఐఎస్ఐ ఖలిస్థానీ ఉద్యమాన్ని ప్రేరేపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా గతంలో కెనడాలో ఖలిస్థానీ అంశంపై రిఫరెండం నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

తర్వాత పలు హిందూ మత చిహ్నాలపై దాడి చేసి ఖలిస్తాన్ జిందాబాద్ అనే రెచ్చగొట్టే రాతలు రాశారు. దీనిపై భారత్ తన ఆందోళనను కెనగా ప్రభుత్వానికి తెలియజేసింది. కానీ, అక్కడ సిక్కు కమ్యూనిటీ ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితుల్లో ఉండడంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్ సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన ఉన్నతాధికారులు పలువురు కెనడాలో స్థిరపడగా, వారే ఐఎస్ఐ సాయంతో ఖలిస్థానీ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.