పొయే కాలం.. హైఓల్టేజ్ టవర్‌పై నుంచి దూకేశాడు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పొయే కాలం.. హైఓల్టేజ్ టవర్‌పై నుంచి దూకేశాడు (వీడియో)

February 6, 2020

air...

200 అడుగుల ఎత్తున్న హై ఓల్టేజ్ టవర్‌పై నుంచి ఓ విదేశీ యాత్రికుడు జంప్ చేశాడు. పారాచ్యూట్ సాయంతో కిందికి దూకేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా వాజిద్‌పూర్  ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 1.33 లక్షల కిలోవాట్ల టవర్ పైకి అతడు ఎలా ఎక్కాడో అర్థం కాక పోలీసులు జత్తు పీక్కుంటున్నారు. భయానకమైన స్టంట్ చేసిన పరదేశీ సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

అతడు జంప్ చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుస్సాహసానికి పాల్పిన యాత్రికుడు ఇటలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. జంప్ చేసేటప్పుడు కరెంటు వైర్లపై పడి ఉంటే ప్రాణం మిగిలేది కాదని అంటున్నారు.